నాగార్జున సినిమాలో ఐటెం గర్ల్ గా లక్ష్మి రాయ్

నాగార్జున సినిమాలో ఐటెం గర్ల్ గా లక్ష్మి రాయ్

Published on Aug 24, 2012 1:06 PM IST


షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న సినిమా ‘డమరుకం’. అక్టోబర్ 12 న విడుదలకి సిద్ధమవుతున్న ఈ సినిమాలో లక్ష్మి రాయ్ ఒక స్పెషల్ సాంగ్లో నర్తించనుంది. మొదటిసారిగా ఆమె ఒక తెలుగు సినిమాలో ఐటెం సాంగ్లో చేయనుంది. ఈ పాట అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ నెల 27 చిత్రీకరించనున్నారు. శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 10 న ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. ఈ సినిమాని నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు