ఆంస్ట్రడాంలో ఎంజాయ్ చేస్తున్న లక్ష్మీ మంచు

Lakshmi-Manchu

లక్ష్మీ మంచు తన హాలిడే గడపడానికి ఐరోపా వెళ్ళారు అక్కడ పది రోజుల పాటు గడపనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆమె నెదర్లాండ్స్ లో గడపనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్లో తెలిపారు.’ 2012లో ఎన్నో విషయాల్లో ప్రశంశలు , మంచి పేరు తెచ్చుకున్నాను. మహిళలు ఇంకా అభివృద్ధి సాదించాలని కోరుకుంటున్నానని’ ట్వీట్ చేసింది. ఈ హాలిడే పూర్తి చేసుకొని జనవరి రెండవ వారంలో ఆమె ఇండియా తిరిగి వచ్చాక “గుండెల్లో గోదారి” చిత్ర విడుదల తేదిని ప్రకటించనున్నారు.

ఈ చిత్రం డిసెంబర్ లోనే విడుదల కావలసి ఉండగా 2013కి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల చెయ్యనున్నారు. లక్ష్మీ మంచు, తాప్సీ, ఆది, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి కుమార్ నాగేందర్ డైరెక్టర్. లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు.

Exit mobile version