‘చందమామ కథలు’ చేయడం గర్వంగా ఉంది – లక్ష్మీ మంచు

‘చందమామ కథలు’ చేయడం గర్వంగా ఉంది – లక్ష్మీ మంచు

Published on Feb 24, 2014 12:40 PM IST

Lakshmi-Manchu--New-Photos-
లక్ష్మీ మంచు, సీనియర్ నరేష్, కృష్ణుడు, ఆమని, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘చన్దమామ్ కథలు’. ‘ఎల్.బి. డబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టొరీ’ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆడియో నిన్న సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది.

ఈ మూవీలో కీల పాత్ర పోషించిన లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘ చందమామ కథలు లాంటి ఓ మంచి మూవీలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. చెప్పాలంటే ఇలాంటి సినిమా చేయడం నాకు గర్వంగా ఉంది. తెలుగు సినిమా చరిత్రలో ఈ మూవీ ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని’ తెలిపింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీని చాణక్య బూనేటి నిర్మించాడు.

తాజా వార్తలు