బాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాలు కూడా చేయలేని పని ఓ చిన్న ఇతర భాషా చిత్రం చేస్తోంది. గుజరాతీలో తెరకెక్కిన ‘లాలో : కృష్ణ సదా సహాయతే’ చిత్రం రికార్డులను తిరగరాస్తూ ఔరా అనిపిస్తోంది. కేవలం రూ.1 కోటి బడ్జెట్‌తో తీసిన ఈ గుజరాతీ సినిమా రూ.15 కోట్ల కలెక్షన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంకిత్ సఖియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి వారం తక్కువ వసూళ్లు వచ్చినా, మేకర్స్ గ్రామాల్లో ఉచిత ప్రదర్శనలు చేయడం టర్నింగ్ పాయింట్ అయింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమా గుజరాత్ అంతటా హిట్ అయింది. ఈ సినిమా విజయంపై బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని దేవరాజ్ డుబారియా, అజయ్ పడారియా నిర్మించగా రీవ రచ్, శ్రుహద్ గోస్వామి, కరణ్ జోషి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
