భారీ ఎత్తున విడుదల కానున్న కృష్ణం వందే…

భారీ ఎత్తున విడుదల కానున్న కృష్ణం వందే…

Published on Nov 12, 2012 11:33 AM IST


ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో యంగ్ హీరో రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా నవంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లకు పైనే విడుదల కానుంది. ఇప్పటివరకూ రానా నటించిన ఏ సినిమా విడుదలవనంత భారీగా ఈ సినిమా విడుదల కానుంది. బళ్ళారిలో జరిగిన మైనింగ్ మాఫియా నేపధ్యంలో ఈ చిత్ర కథను తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడవడంతో అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. సాయి బాబా జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మరియు 14 కట్స్ విధించారు. ‘గమ్యం’ మరియు ‘వేదం’ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వస్తున్న మూడవ సినిమా ఇది.

తాజా వార్తలు