కృష్ణం వందే జగద్గురుం సెన్సార్ తేదీ ఖరారు

“కృష్ణం వందే జగద్గురు” ఈ చిత్ర ట్రైలర్ చూసినప్పటి నుండి పరిశ్రమ మరియు ప్రేక్షకుల కళ్ళు ఈ చిత్రం మీదనే ఉన్నాయి. పవర్ ఫుల్ ట్రైలర్ మాత్రమే కాకుండా పాటలు కూడా జనాదరణ పొందటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నవంబర్ 9న విడుదల కానుంది. రానా మరియు నయనతార ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ చిత్రం ల్యాండ్ మాఫియా నేపధ్యంలో సాగుతుంది ఇందులో రానా బి.టెక్ బాబుగా కనిపిస్తుండగా అయన సరసన నయనతార డ్యాకుమెంటరి తెరకెక్కించే యువతీ పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు నవంబర్ 5న జరగనున్నాయి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయిబాబా జాగర్లమూడి మరియు వై రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకం మీద నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Exit mobile version