తెలుగులో ‘కుమ్కి’

తెలుగులో ‘కుమ్కి’

Published on Dec 3, 2012 7:29 PM IST

శివాజీ గణేషన్ మనవడు, ప్రభు తనయుడు విక్రమ్ ప్రభుని హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో తెరకెక్కిన ‘కుమ్కి’ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గజరాజు’ పేరుతో అనువదిస్తున్నారు. ‘ప్రేమఖైది’ సినిమాతో తెలుగు వారికి సుపరిచితుడు అయిన ప్రభు సాల్మన్ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది. మైనా సినిమాని తెలుగులో ప్రేమఖైదీ పేరుతో డబ్ చేయగా తమిళ్, తెలుగు రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. కుమ్కి సినిమాకి డి. ఇమాన్ సంగీతం అందిస్తుండగా లక్ష్మి మీనన్ హీరోయిన్. తమిళ్లో ప్రముఖ లింగుస్వామి నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ నెలలోనే సినిమాని విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు