ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కుబేర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను అలరించడంలో మంచి విజయం సాధించింది

అయితే, ఈ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపారు. ఇక థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. వారి కోసం మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

కుబేర చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో ‘కుబేర’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version