లోకల్ టు గ్లోబల్ : టైమ్స్ స్క్వేర్‌పై సందడి చేసిన ‘కుబేర’..!

లోకల్ టు గ్లోబల్ : టైమ్స్ స్క్వేర్‌పై సందడి చేసిన ‘కుబేర’..!

Published on Jun 25, 2025 12:01 AM IST

దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా విజయవంతం గా రన్ అవుతోంది. అటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

అయితే, కుబేర క్రేజ్ ఇప్పుడు లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి చేరుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని అమెరికాలోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్ బిల్గింగ్‌పై ప్రమోట్ చేశారు. ఇలా ఈ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ పై చాలా అరుదుగా ఇండియన్ చిత్రాలను ప్రమోట్ చేస్తారు. దీంతో ఇప్పుడు కుబేర క్రేజ్ గ్లోబల్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు