నూతన సంవత్సర కానుకగా రానున్న క్షత్రియ

నూతన సంవత్సర కానుకగా రానున్న క్షత్రియ

Published on Dec 26, 2013 12:00 PM IST

kshatriya
పబ్లిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో శ్రీ కాంత్ కి విజయాలు వచ్చినా పరాజయాలు వచ్చినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. కంటిన్యూగా సినిమాలు చేస్తున్న శ్రీ కాంత్ సంవత్సరంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘క్షత్రియ’. ఈ సినిమా నూతన సంవత్సర కానుకగా జనవరి 1న రిలీజ్ కానుంది. 2014 టాలీవుడ్ బాక్స్ ఆఫీసు శ్రీ కాంత్ సినిమాతో మొదలు కానుంది. 2013లో వచ్చిన మొదటి సినిమా కూడా శ్రీ కాంత్ దే కావడం విశేషం.

కుంకుమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఉదయ చంద్ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాలో ఇప్పటి వరకూ తను చేయని పాత్ర చేసానని, సినిమా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని శ్రీ కాంత్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరం శ్రీ కాంత్ కి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు