బొమ్మరిల్లు భాస్కర్ తన రాబోతున్న చిత్రం లో రామ్ సరసన కథానాయిక కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం “ఒంగోలు గిత్త” అనే పేరు పరిశీలనలో ఉంది. మొదట ఈ చిత్రం కోసం శుభ పుతేలను కథానాయికగా ఎంచుకున్నారు కాని మిర్చి యార్డ్ లో చిత్రీకరణ జరిపే సమయంలో ఆమె అనారోగ్య పాలవడంతో ఆమెను ఈ చిత్రం నుండి తప్పించారు. తరువాత నికితని ఈ చిత్రంలో కథానాయికగా తీసుకున్నారు కాని తాజా సమాచారం ప్రకారం ఈ నటిని కూడా తప్పించినట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ సరసన కృతి కర్భంద కనిపించనుంది. త్వరలో ఈ చిత్ర బృందంతో ఆమె కలవనుంది. గతంలో ఈ నటి “బోణి”,”తీన్ మార్” మరియు “మిస్టర్ నూకయ్య” వంటి చిత్రాలలో నటించింది. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.