టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా రానున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాలో ఎన్ని కట్స్ విధించారు అనే వివరాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాని నవంబర్ 16 లేదా నవంబర్ 23న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు.
రానా మరియు నయనతార జంటగా కనిపించనున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జాగర్లమూడి సాయి బాబు మరియు రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఇప్పటికే మంచి బుజినెస్ జరుపుకుంది. ఆకట్టుకునే ట్రైలర్ ని మరియు ఆసక్తికరమైన పొలిటికల్ సబ్జెక్ట్ సినిమాని చేసినందుకు మా ధన్యవాదాలు.