గతంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు బిజెపి పార్టీలో యాక్టివ్ లీడర్ గా ఉండేవారు. ఆయన 1999-2004 లో విదేశీ వ్యవహారాల విషయంలో రాష్ట్రం నుండి యూనియన్ మంత్రి గా పనిచేసారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆయన బిజెపిని వదిలి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎలక్షన్స్ లో ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు.
దాని తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం కృష్ణం రాజు మళ్ళీ బిజెపి లో చేరనున్నాడని సమాచారం. నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్తానం కృష్ణం రాజుని మరోసారి రాజకీయాల్లోకి వచ్చేలా ప్రభావితం చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఆయన ఢిల్లీలో రంజిత్ సింగ్ ని కూడా కలిసారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.