టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనెర్ చ్చిత్రం “క్రాక్”. తన సాలిడ్ కాంబో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ కాప్ డ్రామా నుంచి నిన్ననే ట్రైలర్ విడుదల అయ్యింది. మరి ఈ మాస్ ట్రైలర్ చూసాక ఈ చిత్రంపై అంచనాలు మరింత స్థాయిలో పెరిగిపోయాయి.
ఇక ఇక్కడ నుంచి ఈ చిత్రం విడుదల కోసం అంతా ఎదురు చూడడం మొదలు పెట్టారు. మరి ఈ గ్యాప్ లో ఈ ట్రైలర్ దుమ్ము లేపేస్తుంది. ఇంకా 24 గంటలు పూర్తి కాకముందే భారీ వ్యూస్ మరియు లైక్స్ తో రవితేజ కెరీర్ లోనే రికార్డు సెట్ చేసింది. కేవలం 20 గంటల్లోనే 6.2 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడమే కాకుండా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.
అంతే కాకుండా దాదాపు 2 లక్షల మేర లైక్స్ సాధించి రవితేజ కెరీర్ లోనే సాలిడ్ రీచ్ అందుకున్న ట్రైలర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రవిశంకర్, సముథ్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ లు పవర్ ఫుల్ విలన్స్ గా కనిపిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఠాగూర్ మధు నిర్మాణం వహించారు.