ఏప్రిల్ లో రానున్న ‘కొత్తజంట’

Kotha-Janta

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్తజంట’. హ్యాట్రిక్ దర్శకుడు మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతరం పనులు జరుగుతునాయి. ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సనాహాలు చేస్తున్నారు. సినిమా పాటలు ఈ నెలాఖరులో విడుదల చేయనున్నారు.

మంచి కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటిస్తుంది.

గీతఆర్ట్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి బున్నివాసు నిర్మిస్తున్నారు. జేబి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్.

Exit mobile version