ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ వల్ల ఆగాల్సి వచ్చింది. అయితే ఈ మధ్యలోనే స్కిప్ట్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అన్ని రకాల హంగులను బాగా సెట్ చేసిన ఈ చిత్రంవిషయంలో కొరటాల మాత్రం తాను అనుకున్నది చేసి చూపే ప్రయత్నంలోనే ఉన్నారని తెలుస్తుంది.
ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ వేసవి విడుదలకు ఆచార్య ను విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యే ఉన్నారట. ఈ చిత్రంలో తొందరలోనే కాజల్ మరియు రామ్ చరణ్ లు కూడా జాయిన్ కానున్నారు. మొత్తానికి మాత్రం కొరటాల ఈ చిత్రం విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఈ చిత్రానికి మెగాస్టార్ ఆల్ టైం హిట్ కాంబో మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.