‘దేవర-2’ కోసం కొరటాల మ్యూజిక్ సిట్టింగ్స్ ?

‘దేవర-2’ కోసం కొరటాల మ్యూజిక్ సిట్టింగ్స్ ?

Published on Nov 23, 2025 5:01 PM IST

devara

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ‘దేవర పార్ట్-2’ జనవరి ఎండింగ్ నుంచి షూట్ స్టార్ట్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ తర్వాత మొదలు అవుతుందట. ఎన్టీఆర్ కొత్త సినిమాల బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా షూట్ ను పోస్ట్ ఫోన్ చేశారట. ఐతే, ఈ లోపు ఈ సినిమా మ్యూజిక్ పై వర్క్ జరగనుంది. ఈ సినిమా షూట్ లోపు అనిరుధ్ తో కొరటాల శివ మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోనున్నాడు.

అన్నట్టు కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు