రభసకు కొండవీటి సింహం పాటను వాడుకోనున్నారా?

NTR-and-Samantha
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వస్తున్న సినిమా ‘రభస’లో ఎన్.టీ.ఆర్ హీరో. ఈ సినిమాలో సమంత, ప్రణీత నాయికలు. ప్రస్తుతం సమంత, ఎన్.టీ.ఆర్, బ్రహ్మానందంలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు

తాజాసమాచారం ప్రకారం ఈ సినిమాలో కొండవీటి సింహం చిత్రంలో సూపర్ హిట్ అయిన ‘అత్తమడుగువాగులో నా అత్తకూతురా’ అన్న పాటను రీ-మిక్స్ చెయ్యనున్నారు. ఈ సమాచారం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.కానీ మన బుడ్డోడికి తాతగారి పాటలను వాడుకోవడం ఆనవాయితీయే. ఈ సమాచారం ఎంతవరకూ నిజమో త్వరలోనే తెలుస్తుంది

ఈ షెడ్యూల్ ముగిసాక జైపూర్ లో మరో షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. గతంలో మన ఎన్.టీ.ఆర్ నటించిన శక్తి సినిమాలో కొన్ని సీన్ లను జైపూర్, రాజస్తాన్లలో చిత్రీకరించారు. ఈ సినిమా వచ్చే యేడు వేసవిలో మనముందుకు రావచ్చు

Exit mobile version