మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘బలుపు’ గురించి ప్రముఖ రచయిత కోన వెంకట్ చాలా ఉత్కంఠగా వున్నారు. ఈ సినిమాలో ఫైనల్ వెర్షన్ చూశాను. ఈ సినిమా రవితేజకి పెద్ద హిట్ ని అందిస్తుందని అన్నాడు. ‘బలుపు’ సినిమా చివరి వెర్షన్ చూశాను. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. రవితేజకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తుంది. ఈ సినిమాలో శృతి హసన్ చూడటానికి చాలా స్టైలిష్ గా వుంది. బ్రహ్మి చాలా బాగా చేశారు. అంజలి, ప్రకాష్ రాజ్ లు ఈ సినిమాకి పెద్ద అసెట్స్. గోపిచంద్ కు ఈ సినిమా మంచి హిట్ ని తెస్తుంది. పీవీపీ సినిమా వారు ఈ సినిమాని మంచి నిర్మాణ విలువలతో నిర్మించారు. థమన్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించి ఇంకాస్త ఎత్తుకి తీసుకెళ్ళారని’ కోనా వెంకట్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ‘బలుపు’ సినిమా పోస్ట్ -ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా జూన్ 28న విడుదలయ్యే అవకాశం ఉంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా రవితేజ కి చాలా కీలకమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తే రవితేజ నిజంగా మరొకసారి పూర్వ వైభవం వస్తుంది.