అస్వస్థతకు గురయిన కోడి రామకృష్ణ

అస్వస్థతకు గురయిన కోడి రామకృష్ణ

Published on Nov 9, 2012 10:09 PM IST

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు స్వల్ప గుండె నొప్పికి గురయ్యారు చెన్నైలో ఉన్న ఈ దర్శకుడిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ లో చేర్పించారు. గత రెండు రోజులుగా కోడి రామకృష్ణ ఉపవాసం ఉండటం ఈ అస్వస్థతకి గల కారణాలలో ఒకటిగా తెలుస్తుంది. అయన ప్రమాదం నుండి బయటపడ్డట్టు అయన కూతురు దివ్య దీప్తి స్పష్టం చేశారు. ” అయన బిపి నార్మల్ లో కి వచ్చింది కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడ్డారు” అని అన్నారు. ఈ దర్శకుడు తెలుగులో “అరుంధతి” వంటి పలు విజయవంతమయిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో అయన పలు చిత్రాలను చేశారు. అయన త్వరగా కోలుకోవాలని 123తెలుగు.కాం కోరుకుంటుంది

తాజా వార్తలు