మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న కో అంటే కోటి

మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న కో అంటే కోటి

Published on Aug 22, 2012 2:45 PM IST


శర్వానంద్ మరియు ప్రియా ఆనంద్ జంటగా తెరకెక్కుతున్నసినిమా ‘కో అంటే కోటి’. రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అవకాయ్ బిర్యాని సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనీష్ కురివిల్లా మరో ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాని మైడెన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ద్వారా సొంతంగా నిర్మిస్తుండటం విశేషం. శర్వానంద్ తన స్నేహితులతో కలిసి ఈ బ్యానర్ ని స్థాపించారు. చేరన్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా మరో చిత్రం తెరకెక్కుతుంది.

తాజా వార్తలు