అడవి శేష్ (పంజా ఫేం) హీరోగా, ప్రియ బెనర్జీ హీరోయిన్ నటిస్తున్న సినిమా ‘కిస్’. ఈ సినిమా ఫస్ట్ టిసర్ ని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అడివి శేష్ దర్శకత్వం వహిస్తు, నటిస్తున్న ఈ సినిమా ఆడియోని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా ఆడియోలో బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ ని విక్స్ చేయడం కోసం వాయిదా వేయడం జరిగింది. ఈ సినిమా ఆడియోని జూన్ 22 తేదిన లేదా 23 తేదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘వినాయకుడు’ సినిమా నిర్మాత సాయికిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల – పీట్ వండర్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. రొమాంటిక్ కామెడీతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.