టీజర్ టాక్: గాలి జనార్దన్ వారసుడు కిరీటి, శ్రీలీల ‘జూనియర్’ ఇంప్రెసివ్ గా

టీజర్ టాక్: గాలి జనార్దన్ వారసుడు కిరీటి, శ్రీలీల ‘జూనియర్’ ఇంప్రెసివ్ గా

Published on Jun 27, 2025 6:05 PM IST

ప్రముఖ బిజినెస్ మెన్ అలాగే రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి రెడ్డి హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ యూత్ ఫుల్ చిత్రమే “జూనియర్”. మరి ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇదైతే మంచి ఎనర్జిటిక్ గా మరియు కలర్ ఫుల్ గా ఉందని చెప్పవచ్చు.

ఇందులో కిరీటి మంచి ఉత్సాహంగా చార్మింగ్ లుక్స్ తో కనిపిస్తుండగా శ్రీలీలతో తన సీన్స్ కూడా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. అలాగే యువ నటుడు డాన్స్ మూమెంట్స్ కానీ తన స్టైలింగ్ గాని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక నటి జెనీలియా కూడా సాలిడ్ పాత్రలో కనిపించనున్నట్టుగా తన రోల్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక టీజర్ లో సంగీతం, మేకర్స్ నిర్మాణ విలువలు అలాగే సినిమాటోగ్రఫి ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి యంగ్ హీరో సాలిడ్ డెబ్యూ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈ జూలై 18న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు