సమీక్ష: ‘సంతాన ప్రాప్తిరస్తు’ – ఫన్ గా సాగే సున్నితమైన సబ్జెక్ట్

Santhana-Prapthirasthu

విడుదల తేదీ : నవంబర్ 14, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : విక్రాంత్, చాందిని చౌదరి, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకుడు : సంజీవ్ రెడ్డి
నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
సంగీత దర్శకుడు : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రాఫర్ : మహి రెడ్డి పండుగల
ఎడిటర్ : సాయి కృష్ణ గానాల

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన చైతన్య (విక్రాంత్) ఒక ఇంట్రోవర్ట్ కావడంతో అమ్మాయిలతో మాట కలపడానికి కూడా తపటాయిస్తుంటాడు. అలాంటి తనకి ఊహించని విధంగా కళ్యాణి (చాందిని చౌదరి) పరిచయం అవుతుంది. వారి పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారి ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే వరకు వెళుతుంది. కానీ పెళ్లి తర్వాత చైతన్యకి వీర్యకణాల సంఖ్య తక్కువ ఉంది అని తెలుస్తుంది. మరి ఇలాంటి ఒక సమస్య నుంచి ఈ యువ జంట సమాజంలో ఎలా నెట్టుకొచ్చింది. తమకి పిల్లలు పుట్టారా లేదా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మెయిన్ గా ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కనిపించే సున్నితమైన సబ్జెక్టు అలాగే దానిని హ్యాండిల్ చేసిన విధానం అని చెప్పవచ్చు. ఎక్కడా గీత దాటకుండా ఎబ్బెట్టుగా అనిపించకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ప్రెజెంట్ చేయడం బాగుంది. అలాగే ఇందులో సాలిడ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.

మెయిన్ గా సెకండాఫ్ లో ఫన్ రైడ్ ని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక నటీనటుల్లో యంగ్ హీరో విక్రాంత్ మంచి నటన కనబరిచాడు అని చెప్పాలి. తన మొదటి సినిమాతో పోలిస్తే ఇందులో తనని తాను మరింత బెటర్ గా చేసుకోవడం బాగుంది. తనలోని లోపాన్ని కవర్ చేసుకునే కుర్రాడిలా కొన్ని క్లిష్ట పరిస్థితులని హ్యాండిల్ చేసే సన్నివేశాలు అలాగే నటుడు మురళీధర్ గౌడ్ తో హాస్య సన్నివేశాలు తనకి వర్కౌట్ అయ్యాయి.

ఇక హీరోయిన్ చాందిని చౌదరి ఈ సినిమాలో సోల్ అని చెప్పవచ్చు. తనకిచ్చిన పాత్ర ఆమె చాలా బాగా చేసింది. సింపుల్ అండ్ డీసెంట్ రోల్ లో ఒక పక్కింటి అమ్మాయిగా బాగా చేసింది. అలాగే ఒక ఎమోషనల్ సీన్ లో ఆమె నటన మరింత మెరుగ్గా కనిపిస్తుంది. ఇక కమెడియన్ అభినవ్ గోమఠం సినిమాలో కామెడీ ట్రాక్స్ లో మరో హైలైట్ అని చెప్పవచ్చు. తనపై కామెడీ సీన్స్ అలానే తన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది.

ఇక మరో హైలైట్ మాత్రం నటుడు మురళీధర్ గౌడ్ అని చెప్పాలి. తనకి గత సినిమాల్లో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అండ్ సాలిడ్ రోల్ ఈ సినిమాలో పడింది అని చెప్పవచ్చు. అలాంటి రోల్ లో తాను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి రక్తి కట్టించారు. అలాగే వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్ లు కూడా తమ రోల్స్ లో బాగా చేసి సినిమాలో అదనపు ఆకర్షణ అయ్యారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కథనం ఆద్యంతం వినోదభరితంగా ఉన్నప్పటికీ సాలిడ్ ఎమోషనల్ కంటెంట్ మాత్రం మిస్ అయ్యింది అని చెప్పాలి. దాదాపు కామెడీ పైనే ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అయితే ఎమోషన్స్ కూడా ఉన్నాయి కానీ వాటిని బాలన్స్డ్ గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

రెంటినీ బాలన్స్ చేసి ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. సో వీటిని బాలన్స్ గా కోరుకునేవారికి కొంచెం నిరాశగా అనిపించవచ్చు. అలాగే సినిమా ఆరంభం కొంచెం స్లోగా అనిపిస్తుంది. అలాగే లవ్ ట్రాక్ సినిమాలో కొంచెం సింపుల్ గానే అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా థీమ్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ అంతా నీట్ గా ఉంది. అలాగే సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. మహి రెడ్డి అందించిన కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. మెయిన్ గా సెకండాఫ్ ని బాగా చేశారు.

ఇక దర్శకుడు సంజీవ్ రెడ్డి విషయానికి వస్తే.. ఒక సున్నితమైన అంశాన్ని తాను హ్యాండిల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. ఒక బోల్డ్ అంశాన్ని హాస్యాన్ని జోడించి మంచి పాత్రలు వాటిని తీర్చిదిద్దిన తీరు చాలా నీట్ గా అనిపిస్తాయి. అయితే తాను ఎక్కువగా కామెడీ పైనే ఫోకస్ చేశారు. ఎమోషనల్ పరంగా కూడా కొంచెం బాలన్స్ వర్క్ ని హ్యాండిల్ చేసి ఉంటే ఈ చిత్రం ఇంకా బెటర్ ఫీల్ ని అందించి ఉండేది. అయినప్పటికీ తన వర్క్ ఈ సినిమాలో మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఒక సున్నితమైన సబ్జెక్టుతో సాగే డీసెంట్ కామెడీ డ్రామా అని చెప్పవచ్చు. దర్శకుడు పని తీరు అందులో పాత్రలు వాటి చుట్టూ అల్లుకున్న కామెడీ కథనం ఈ చిత్రంలో ఎంగేజ్ చేస్తాయి. అలాగే విక్రాంత్, చాందిని ఇంకా మురళీధర్ గౌడ్ లు తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నారు. అయితే ఎమోషనల్ పార్ట్ పై ఇంకొంచెం దృష్టి పెట్టుంటే ఈ సినిమా ఇంకా బెటర్ ఫీల్ కలిగించేది. ఇది కొన్ని చోట్ల స్లో మూమెంట్స్ పక్కన పెడితే ఈ చిత్రం ఈ వారాంతానికి మంచి హాస్యాన్ని అందిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version