యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తన సొంత ప్రొడక్షన్ ‘క ప్రొడక్షన్స్’లో ‘క’ అనే చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు ఈ హీరో. ఇక తన అభిమానులు తనపై చూపుతున్న ప్రేమకు, సపోర్ట్‌కు కృతజ్ఞతగా కొత్త ట్యాలెంట్‌కు అవకావం ఇచ్చేందుకు కిరణ్ అబ్బవరం సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ అప్డేట్ ఇచ్చాడు.
తన నెక్స్ట్ చిత్రంతో సినీ పరిశ్రమకు కొత్త ట్యాలెంట్‌ను పరిచయం చేయబోతున్నట్లు కిరణ్ ప్రకటించాడు. తమ ‘క ప్రొడక్షన్స్’ నుంచి రానున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను జూలై 10న అనౌన్స్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించిన అప్డేట్‌ను జూలై 9న సాయంత్రం 5.01 గంటలకు ఇవ్వనున్నట్లు కిరణ్ తెలిపారు.
ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కె-ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. మరి కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ఎలాంటి ట్యాలెంట్‌ను పరిచయం చేస్తాడో చూడాలి.