విడుదల తేదీ : అక్టోబర్ 18, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయి కుమార్, నరేష్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకుడు : జైన్స్ నాని
నిర్మాత : రాజేష్ దండ, శివ బొమ్మక్
సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రాఫర్ : సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ దీపావళి కానుకగా థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రాల్లో సాలిడ్ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేస్తూ వచ్చిన చిత్రం కే ర్యాంప్ కూడా ఒకటి. యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
పెద్ద బిజినెస్ మెన్ అయినటువంటి కృష్ణ (సాయి కుమార్) కి ఒక చిల్లరగా తిరిగే మాస్ కొడుకే కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం). తన కొడుకుకి ఎలాగో పెద్దగా చదువు అబ్బడం లేదని కేరళలో ఓ కాలేజ్ లో జాయిన్ చేయిస్తాడు. ఇక అక్కడ తనకి తొలి చూపు లోనే మెర్సీ జాన్ (యుక్తి తరేజా) నచ్చేస్తుంది. దీనితో లైఫ్ లాంగ్ ఆమెతో ఉంటానని ప్రామిస్ కూడా చేస్తాడు. కానీ అక్కడ నుంచే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. మెర్సీ కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? దానివల్ల కుమార్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి కుమార్ తన నాన్న విషయంలో తెలుసుకుంది ఏంటి? ఆమె సమస్యకి పరిష్కారం చూపించాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
కిరణ్ అబ్బవరం కి ఉన్న స్ట్రాంగ్ జోన్ జానర్ లో ఎంటర్టైన్మెంట్ కూడా కూడా ఒకటి. కొంచెం డీసెంట్ లైన్ ఉన్నా కూడా మంచి కామెడీతో లాక్కొచ్చేస్తాడు. అలాంటి ఎంటర్టైనర్ నే ఇది కూడా అని చెప్పొచ్చు. మెయిన్ గా ఈ సినిమాలో సెకండాఫ్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్ పై వచ్చే సన్నివేశాలు వీటితో పాటుగా నటుడు నరేష్ పై కొన్ని హిలేరియోస్ కామెడీ ఎపిసోడ్స్ థియేటర్స్ లో ఆడియెన్స్ చేత నవ్వులు పూయిస్తాయి.
అలాగే ఫస్టాఫ్ లో కూడా అక్కడక్కడా కామెడి సీన్ వర్క్ అవుతాయి. అంతేకాకుండా సెకండాఫ్ లో కామెడీతో పాటుగా ఎమోషనల్ మూమెంట్స్ కదిలిస్తాయి. ఇలా ఇక్కడ మాత్రం కామెడీ, ఎమోషనల్ పార్ట్ బ్యాలెన్స్డ్ గా వర్క్ అయ్యిందని చెప్పవచ్చు. అలానే లాస్ట్ లో ఇచ్చిన ఏఐ ఎండింగ్ కూడా మంచి ఫన్ గా అనిపిస్తుంది. ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన రోల్ లో సాలిడ్ పెర్ఫార్మన్స్ ని అందించాడు.
అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడిలా మంచి నటన తను కనబరిచాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుమార్ అనే పాత్ర తాలూకా మూడ్ ని మైంటైన్ చేస్తూ అలరించాడు అని చెప్పవచ్చు. కొన్ని కొన్ని సీన్స్ కోసం ఇంట్రెస్టింగ్ స్టెప్పులు కూడా తీసుకోవడం నటుడుగా తనని ప్రూవ్ చేస్తుంది. ఇక హీరోయిన్ యుక్తి తరేజాకి ఈ సినిమాలో మంచి రోల్ దక్కింది అని చెప్పవచ్చు.
ఒక డిజార్డర్ ఉన్న అమ్మాయిగా మంచి నటన ఆమె కనబరిచింది. అలానే గ్లామర్ కి గ్లామర్ మంచి కెమిస్ట్రీ ఇంకా రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె బాగా చేసింది. ఇక నటుడు నరేష్ రోల్ సినిమాలో మరో హైలైట్ అని చెప్పాలి. తనపై కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా బాగుంది. ఇక తనతో పాటు సాయి కుమార్ కి డీసెంట్ రోల్ పడింది. తన పాత్ర తాలూకా ఇంపార్టెన్స్ బాగుంది.
ఇక వీరితో పాటుగా కిరణ్ అబ్బవరంకి ఫ్రెండ్ గా కనిపించిన నటుడు, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. వెన్నెల కిషోర్ కూడా ఉన్న కొంచెం సేపు మంచి ఫన్ ఇచ్చి వెళ్లారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో కొంచెం డిజప్పాయింట్ చేసే అంశం ఏది అంటే ఒకింత రొటీన్ గా సాగే ఫస్టాఫ్ అని చెప్పాలి. ఫస్టాఫ్ లో మరీ ఎక్కువ ఎంగేజ్ చేసే అంశాలు లేవు. ఓకే అక్కడక్కడా కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ కథనం అలా బిలో యావరేజ్ రేంజ్ లో అనిపిస్తుంది.
అంతే కాకుండా అక్కడక్కడా కథనం రొటీన్ అండ్ ఊహాజనిత రీతిలోనే కొనసాగుతుంది. ఇంకా హీరోయిన్ రోల్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం డీటైలింగ్ ని పాటించాల్సింది. కమెడియన్ అలీ, శ్రీనివాస్ రెడ్డి లాంటి నటులని ఇంకా బాగా వాడుకుంటే బాగుణ్ణు.
ఒక మూమెంట్ లో నరేష్ విషయంలో కూడా ఇలానే అనిపిస్తుంది. వీటితో పాటుగా పెదవి ముద్దు సన్నివేశాలు లాంటివి కొంచెం ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. ఇవి ఓ సెక్షన్ ఆడియెన్స్ కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాత రాజేష్ దండ నిర్మాణ విలువలు బాగున్నాయి. నీట్ సెటప్ తో సినిమాని ప్లాన్ చేసుకున్నారు. ఇక సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సంగీతం బాగుంది. సతీష్ రెడ్డి మాసం ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. కేరళకు షిఫ్ట్ అయ్యిన తర్వాత నుంచి మరింత మంచి విజువల్స్ తను చూపించారు. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. అలాగే చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది కానీ ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ తగ్గించాల్సింది. అలాగే డైలాగ్స్ బాగున్నాయి.
ఇక దర్శకుడు జైన్స్ నాని విషయానికి వస్తే తన నుంచి ఇదొక డీసెంట్ డెబ్యూ అని చెప్పొచ్చు. డీసెంట్ లైన్ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్ ఇందులో తన నుంచి మెప్పిస్తాయి. అయితే సెకండాఫ్ పై తన దృష్టి ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ ని కూడా ఇదే రీతిలో తను ప్రెజెంట్ చేసి ఉంటే ఓవరాల్ రిజల్ట్ మరింత బెటర్ ఫీల్ కలిగించి ఉండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “కే ర్యాంప్” ఈ దీపావళికి అక్కడక్కడ నవ్వించే టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఒక రొటీన్ అండ్ ఫ్లాట్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. మంచి ఫన్ అలానే డీసెంట్ ఎమోషనల్ టచ్ బాగున్నాయి. సో ఆ కొన్ని అంశాలు పక్కన పెడితే ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team