‘కె-ర్యాంప్’లో ఆ పదాలపై కిరణ్ అబ్బవరం క్లారిటీ..!

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ “కె-ర్యాంప్” ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను జైన్స్ నాని డైరెక్ట్ చేస్తుండగా హాస్య మూవీస్ మరియు రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్కు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు.

అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌లో కిరణ్ అబ్బవరం వాడిన బూతులపై విలేకరులు ప్రశ్నించారు. కిరణ్ అబ్బవరం ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఈ డైలాగ్స్ లేవా అని వారు ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. “కె-ర్యాంప్‌లో హీరో ఎంత ఎసెంట్రిక్‌గా ఉంటాడో చూపించడానికి టీజర్‌లో ఒకటి రెండు మాటలు వాడాం. కానీ థియేటర్‌కి వచ్చాక మీరే షాక్ అవుతారు. సినిమాలో ఇలాంటి పదాలు దాదాపు ఉండవు. ట్రైలర్ వచ్చేసరికి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని హృదయపూర్వకంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మంచి ఎమోషన్ ఉంది” అని కిరణ్ అబ్బవరం తెలిపారు.

ఇక యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version