రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయగా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని మంచి అంచనాల మధ్య జూలై 31న గ్రాండ్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయగా, అక్కడ ఈ సినిమా స్టన్నింగ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
వీకెండ్ ఉండటంతో ఈ కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ చెబోతంది. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. అనిరుధ్ సంగీతం అందించగా ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.