కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన నాగ్.!

కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన నాగ్.!

Published on Nov 6, 2020 1:02 PM IST

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన కింగ్ నాగార్జున ఇప్పుడు ఒక పక్క తన సినిమాలు మరియు షోలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నాగ్ ఇప్పుడు నటిస్తున్న ఆసక్తికర మరియు మోస్ట్ అవైటెడ్ చిత్రం “వైల్డ్ డాగ్” ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్యనే తాను చేస్తున్న గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 కు చిన్న బ్రేక్ ఇచ్చి హిమాలయాల్లో ఒక కీలక షెడ్యూల్ కు గాను నాగ్ పయనమయ్యారు.

ఎముకులు కొరికే చలిలోనే అందులోను ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ ఈ కీలక షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ షూటింగ్ లో సైయామి ఖేర్, అలీ రెజా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఒక ఎన్ ఐ జెడ్ ఆఫీసర్ గా కనిపించనుండగా దర్శకుడు అహిషర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో దియా మీర్జా ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు