‘కుబేర’ కి ముగించేసిన కింగ్ నాగ్!

‘కుబేర’ కి ముగించేసిన కింగ్ నాగ్!

Published on Jun 7, 2025 2:00 PM IST

అక్కినేని వారి ఇంట ప్రస్తుతం పెళ్లి వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన చిన్న కొడుకు అఖిల్ అక్కినేని వివాహంని నాగార్జున ఘనంగా జరిపి మరో భాద్యత తీర్చుకున్నారు. అయితే ఇవి కాకుండా నాగార్జున సినిమాలని కూడ బ్యాలన్స్డ్ గా కొనసాగిస్తూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా దూసుకెళ్తున్నారు.

మరి నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం ‘కుబేర’ కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో నాగార్జున చేస్తున్న పాత్రకి గాను తన డబ్బింగ్ మొత్తాన్ని ఇపుడు పూర్తి చేసి కుబేరకి తన భాద్యత ముగించారు. ఇక నెక్స్ట్ మిగతా పనులు అన్నీ ఈ సినిమాకి జరగనున్నాయి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా జూన్ 20న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు