పవన్ డేట్స్ ఇచ్చారా? ట్విస్ట్ ఇచ్చిన “మార్కో” విలన్!

మన టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “హరి హర వీరమల్లు” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇపుడు అంతిమ దశలో ఉంది. అయితే పవన్ నుంచి ఇంకా కావాల్సింది నాలుగు రోజులు డేట్స్ మాత్రమే అని తెలిసిందే.

మరి ఈ నాలుగు రోజులు ఎప్పుడు ఇస్తారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారగా ఇపుడు “మార్కో” సినిమా విలన్ నటుడు కబీర్ దుహన్ సింగ్ తాను వీరమల్లు షూట్ సెట్స్ లో చివరి షెడ్యూల్ కోసం జాయిన్ అయ్యినట్టుగా ఓఅప్డేట్ ఇవ్వగా ఇది వైరల్ గా మారింది. మరి దీనితో పవన్ కూడా డేట్స్ ఇచ్చారా, షూటింగ్ ఎట్టకేలకి కంప్లీట్ అవుతుందా అని టాక్ మొదలైంది. మరి ఈ ఒక్క సినిమాని ప్రస్తుతం పూర్తి చేసేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎపుడు పూర్తవుతుంది అనేది.

Exit mobile version