ఈసారి రామ్ చరణ్ ఛాయిస్ ఆమేనా ?

ఈసారి రామ్ చరణ్ ఛాయిస్ ఆమేనా ?

Published on Mar 23, 2021 10:38 PM IST

kiara advani ram charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ఆర్ఆర్ఆర్’ తరవాత శంకర్ డైరెక్షన్లో సినిమాను మెదలుపెట్టనున్నారు. తమిళంలో చేస్తున్న ‘ఇండియన్ 2’ ఆగిపోవడం, ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోవడంతో శంకర్ రామ్ చరణ్ సినిమాకు కమిటయ్యారు. ఈ చిత్రం జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇది పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమా అంటున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉంటుంది కాబట్టి బడ్జెట్ కూడ పెద్దదేనట. సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

అందుకే సినిమాలో కథానాయకి కూడ అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయమున్న నటి అయితే బాగుంటుందని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. కాబట్టే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలని చూస్తున్నారట. ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ అనే సినిమా చేసింది. ఆ సినిమా తరవాత మళ్ళీ ఆమె తెలుగులో సినిమా చేయలేదు. పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు ఆమె వద్దకు చరణ్-శంకర్ సినిమాల ఆఫర్ వెళ్ళింది. ఆమెకు కూడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి సుముఖంగానే ఉందట. అన్నీ అనుకున్నట్టే జరిగితే వీరి చిత్రం 2023 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు