తమిళనాట భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విలక్షన నటి కుష్బూ. ఎదో ఒక విషయంలో అప్పుడప్పుడు వార్తల్లో నిలిచే కుష్బూ మళ్ళీ వార్తల్లో నిలిచింది. తమిళనాడు హిందూ మతం వారు హిందువులు పవిత్రంగా భావించే దేవుని బొమ్మలు ఉన్న చీరని ధరించిందని కుష్బూ పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాల్ – త్రిష జంటగా నటించిన ‘వేటాడు-వెంటాడు’ సినిమా ఆడియో వేడుకకి కుష్బూ ఈ చీరలో వచ్చింది.
ఈ విషయం పై స్పందించడానికి కుష్బూ నిరాకరించింది. ‘ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. పబ్లిసిటీ కావాలనుకున్న కొంత మంది ఇలా చేస్తున్నారని’ ఆమె అంది. కొద్ది సంవత్సరాల క్రితం కుస్భూ ఆడవారి వర్జినిటీ విషయంలో వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు కుష్బూ పబ్లిక్ గా క్షమాపణ చెబుతుందా లేక ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తుందో? అనేది చూడాలి.