విలక్షణ నటి ఖుష్బూ కి ప్రపంచమంతా కోట్ల మంది అబిమానులు వున్నారు. కానీ తను మాత్రం జూనియర్ ఎన్.టి.ఆర్ కి వీరాబిమాని. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు పబ్లిక్ గా తెలియజేశారు కూడా. ఖుష్బూ ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమాని ఫస్ట్ డే చూడనున్నట్టు ట్వీట్ చేసింది. ‘ఏంటో గెస్ చేయండి?? నేను రేపు ‘బాద్షా’ సినిమాని చూడబోతున్నాను. నా డైరెక్టర్ నేను ఎన్.టి.ఆర్ అభిమానినని తెలిసి నన్ను ఆశ్చర్య పరచడానికి ‘బాద్షా’ సినిమా టికెట్లను బుక్ చేశాడు. సో.. స్వీట్ ‘ అని ట్వీట్ చేశాడు.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘బాద్షా’ ఈ వేసవిలో బ్రమండమైన కలెక్షన్ లను నమోదు చేసుకోనుందని బావిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ నిర్మించాడు.