సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో “ఖలేజా” కూడా ఒకటి. అప్పట్లో సినిమాకి సరైన ఆదరణ దక్కలేదు కానీ తర్వాత మాత్రం నెమ్మదిగా ఒక కల్ట్ క్లాసిక్ గా నిచిపోయి అన్ని వర్గాల ఆడియెన్స్ లో గట్టి ఆదరణ సొంతం చేసుకుంది. మరి ఇదే ఇపుడు రీరిలీజ్ లో విధ్వంసం సృష్టించేలా చేస్తుంది.
ఖలేజా రీరిలీజ్ అని చెప్పిన నాటి నుంచే అంచనాలు ఉన్నాయి. మరి ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పేందుకు దీనికి అవుతున్న బుకింగ్స్ సాక్ష్యం అని చెప్పొచ్చు. బుక్ మై షోలో ఆరంభించిన 24 గంటల్లో రికార్డు బుకింగ్స్ ఖలేజా నమోదు చేసింది. మన సౌత్ లోనే ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ తో మొత్తం 75 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. ఇలా ఖలేజా రీరిలీజ్ లో కొత్త నంబర్స్ సెట్ చేస్తుంది అని చెప్పి తీరాల్సిందే.