కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కేజీఎఫ్ మూవీలో బాంబే డాన్ ‘శెట్టి’ పాత్రలో నటించిన దినేశ్ మంగళూరు కన్నుమూశారు. ఈ సినిమాలో ఆయన చిన్న పాత్ర పోషించినప్పటికీ.. ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. కాగా ఆయన నటుడిగానే కాకుండా ‘వీర మదకరి’, ‘చంద్రముఖి ప్రాణసఖి’, ‘రాక్షస’ తదితర చిత్రాలతో ఆర్ట్ డైరెక్టర్‌గానూ గుర్తింపు పొందారు.
నటుడు దినేశ్ మంగళూరు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన సినీ స్నేహితులు కోరుకున్నారు. ‘‘దినేశ్ గారూ తన జీవితం మొత్తం సినిమా రంగంలోనే గడిపారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలుపుతూ.. నటుడు దినేశ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మా 123తెలుగు.కామ్ తరఫున నటుడు దినేశ్ మంగళూరు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.