“కేజీయఫ్ చాప్టర్ 2” కాస్త డిఫరెంట్ గా ఉంటుందా.?

“కేజీయఫ్ చాప్టర్ 2” కాస్త డిఫరెంట్ గా ఉంటుందా.?

Published on Dec 25, 2020 3:00 AM IST

మొత్తం మన ఇండియన్ సినిమాకే పరిచయం అక్కర లేని మాస్ ఎంటర్టైనర్ చిత్రం “కేజీయఫ్”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాకు సీక్వెల్ “కేజీయఫ్ చాప్టర్ 2” ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి సినిమాలానే దీనిని కూడా అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.

కానీ మొదటి సినిమాకు దీనికి చాలానే డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. మొదటి పార్ట్ లో కేజీయఫ్ రాజ్యాన్ని సొంతం చేసుకునే రాకీ భాయ్ గా కనిపిస్తే సెకండ్ పార్ట్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే వార్ లో కూడా రాకీ భాయ్ ఎలా నిలబలాడతాడు అనే టైప్ లో ఉంటుందని టాక్. మరి ఈసారి ప్రశాంత్ నీల్ భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం వచ్చే జనవరి 8న రానున్న టీజర్ తో మాత్రం చాలా ప్రశ్నలకే సమాధానం దొరకొచ్చు.

తాజా వార్తలు