‘డాకు మహారాజ్’కి అక్కడ ఫుల్ డిమాండ్ !

‘డాకు మహారాజ్’కి అక్కడ ఫుల్ డిమాండ్ !

Published on Feb 24, 2025 12:06 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్ల డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా థియేటర్లలో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ అటు ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. ఈ నెల 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓటీటీ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా డాకు మహారాజ్ ను చూసి ఇతర భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే మలయాళ ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇలాంటి విజువల్ మాస్ ఫీస్ట్ చూడలేదు, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్ అని పోస్ట్ లు పెడుతున్నారు.

మొత్తానికి ‘డాకు మహారాజ్’ సినిమా పాకిస్తాన్, బాంగ్లాదేశ్,UAE వంటి దేశాలలో టాప్ 2 లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. కాగా ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, బేబీ వేద అగర్వాల్ మరియు VTV గణేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలయ్య పై యాక్షన్ సీక్వెన్స్‌ లను ఎఫెక్టివ్ గా డిజైన్‌ చేశారు. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు