జగపతి బాబుకు క్షమాపణలు చెప్పిన కీర్తి సురేశ్

హీరోయిన్ కీర్తి సురేశ్ సీనియర్ హీరో జగపతి బాబుకు క్షమాపణలు చెప్పింది. జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. తాజాగా కీర్తి ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తన పెళ్లికి సంబంధించిన విశేషాలు ఆమె పంచుకుంది. అయితే, తన పెళ్లికి జగపతి బాబును పిలవలేకపోయానంటూ ఆయనకు క్షమాపణలు తెలిపింది. ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి తన ప్రేమ గురించి తెలుసని వారిలో జగపతి బాబు కూడా ఒకరని కీర్తి చెప్పుకొచ్చింది.

కీర్తి సురేశ్ ఇంకా ఏం చెప్పిందంటే.. ‘పెళ్లి అయ్యేవరకూ నా ప్రేమ గురించి చాలా తక్కువమందికి చెప్పాను. నేను మిమ్మల్ని (జగపతిబాబు) నమ్మాను కాబట్టి మీకు కూడా నా వ్యక్తిగత విషయాల గురించి చెప్పాను. కానీ, పెళ్లికి పిలవలేకపోయాను. క్షమించండి’’ అని కీర్తి సురేశ్ తెలిపింది. తాను ఆంథోనీ తటిల్‌తో ప్రేమలో పడ్డ విషయం గురించి కూడా ఇదే షోలో చెబుతూ.. మేం 15 ఏళ్లు ప్రేమించుకున్నాం. ఆరేళ్లు తను ఖతార్‌లో ఉన్నాడు, నేను ఇండియాలో ఉన్నాను. నాలుగేళ్ల క్రితమే ఇంట్లో చెప్పాం. చివరకు పెళ్లి చేసుకున్నాం’ అని కీర్తి సురేశ్ తెలిపింది.

Exit mobile version