ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఐతే, దేవర: పార్ట్ 1 థియేటర్స్ లో విడుదలై ఇప్పటికే, ఏడాది అయింది. ఆసక్తికరంగా, ఈ సినిమా శాటిలైట్ హక్కులు మాత్రం ఏడాదిగా అమ్ముడుపోలేదు. అయితే, నిర్మాతలు చివరకు టెలివిజన్ ఒప్పందాన్ని ముగించారు. స్టార్ గ్రూప్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ అక్టోబర్ 26, 2025న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్‌లో ప్రపంచవ్యాప్తంగా దేవర టెలివిజన్ ప్రీమియర్ ను ప్రదర్శిస్తున్నారు.
ఇక తెలుగు టెలివిజన్ ప్రీమియర్ విషయానికొస్తే, ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. ప్రసార తేదీకి సంబంధించి ‘స్టార్ మా’ నుండి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.అన్నట్టు ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి దేవర పార్ట్ 2ను కూడా మేకర్స్ స్టార్ట్ చేయనున్నారు.