ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “సర్కారు వారి పాట” చిత్రం షూటింగ్ కు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి గాను గత కొన్నాళ్ల కితమే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఓకే అయ్యింది. ఇక అక్కడ నుంచి మహేష్ ఫ్యాన్స్ లో ఈ కాంబో పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అయితే గత కొంత కాలం నుంచి మాత్రం కీర్తి ఈ సినిమాలో తాను చెయ్యబోయే రోల్ విషయంలో చాలా ఎగ్జైట్ గా ఉంది. అందుకు తగ్గట్టుగానే కీర్తి రెడీ అవుథుడ్ని. అయితే తన సోషల్ మీడియాలో లేటెస్ట్ గా తాను పెట్టిన చాట్ సెషన్ లో మరోసారి చెప్పడమే కాకుండా ఈ చిత్రానికి కూడా తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని మరో అంశాన్ని వెల్లడించారు. తెలుగులో కీర్తి ఇప్పటికే చాలానే సినిమాలకు డబ్బింగ్ చెప్పింది. మరి ఈ భారీ సినిమాలో కీర్తి ఎలాంటి పాత్రలో కనిపించనుందో చూడాలి.