‘మిస్ ఇండియా’ పై అవి రూమర్సే !

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమా ఓటిటీ ప్లాట్‌ ఫామ్‌ లో విడుదల కానుందని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ కు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

అన్నట్టు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించబోతున్నారట. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ యాక్టింగ్ చేసిందట.

ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆసక్తి క్రియేట్ అవుతుంది.

Exit mobile version