కేవలం అందం,అభినయం తోనే కాకుండా చక్కనైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఎక్కడా హద్దులు దాటకుండా అందంతో ఆకట్టుకున్న కీర్తీకి “మహానటి” సినిమా తర్వాత మరింత మరింత కీర్తి పెరిగింది. దీని తర్వాత నుంచి కీర్తి చేపట్టిన ప్రతీ ప్రాజెక్ట్ కూడా మంచి హైప్ ను సంతరించుకున్నాయి.
అయితే అలా కొన్నాళ్ల తర్వాత అకస్మాత్తుగా కీర్తి బరువు తగ్గడం స్టార్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనితో ఓ మీడియా ఏజెన్సీ వారు కీర్తి ఎక్స్ పోజింగ్ చేసేందుకే సన్నబడింది అని పలు రకాల కథనాలు వెలుబుచ్చారు. ఈ కథనాలపై కీర్తి ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా కాస్త ఘాటుగానే తన స్పందనను తెలియజేసారు. తనపై వచ్చిన ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని కొట్టిపారేశారు. తాను బరువు తగ్గింది సినిమాలలో నాజూగ్గా కనిపించడానికి తప్ప అలంటి రోల్స్ లో కనిపించడానికి కాదు అన్ని తనపై వచ్చిన రూమర్ కు చెక్ చెప్పేసారు.