రాఘవేంద్ర రావు “ఇంటింటా అన్నమయ్య” చిత్ర రికార్డింగ్ మొదలు పెట్టిన కీరవాణి


కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రానున్న భక్తి రస చిత్రం “ఇంటింటా అన్నమయ్య” చిత్రం కోసం ఎం ఎం కీరవాణి పాటల రికార్డింగ్ మొదలు పెట్టారు.ఈ కార్యక్రమానికి బాలకృష్ణ,నయనతార మరియు రమేష్ ప్రసాద్ హాజరయ్యారు. యలమంచలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంతో యలమంచలి సాయిబాబు తనయుడు రేవంత్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవ్వనున్నాడు. అనన్య మరియు సనమ్ శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “రికార్డింగ్ ని ఒక్క సిట్టింగ్ లోనే పూర్తి చేస్తాము ఈ చిత్రం దసరాకి మొదలవుతుంది నవంబర్ 1 నుండి నవంబర్ 20 వరకు ఈ చిత్రం అరకులో చిత్రీకరణ జరుపుకుంటుంది. డిసెంబర్ 1న మరో షెడ్యూల్ మొదలవుతుంది ఆ షెడ్యూల్ లోనే చిత్రాన్ని పూర్తి చేస్తాము” అని నిర్మాత అన్నారు. ఈ చిత్రం సంగీతం మీద ఆధారపడిన చిత్రంగా ఉండబోతుంది.

Exit mobile version