ఆ సీన్ గొప్పగా తీసానని పవన్ మెచ్చుకున్నారు – కరుణాకరన్

Pawan-and-Karunakaran
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ చెక్కు చెదరని మెయిలు రాయిలా నిలిచిపోయిన సినిమా, డైరెక్టర్ కరుణాకరన్ అద్భుతమైన బాట వేసిన సినిమా ‘తొలిప్రేమ’. ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా అంతా ఒక ఎత్తైతే ఈ సినిమా క్లైమాక్స్ ఒక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్న సీన్ అది.

ఆ సీన్ ఎలా తీసామన్న దాన్ని గురించి డైరెక్టర్ కరుణాకరన్ వివరిస్తూ ‘ ఎయిర్ పోర్ట్ లో వచ్చే క్లైమాక్స్ సీన్ లో పవన్ దగ్గరకు వెళ్లి హీరోయిన్ మీ దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చి మీ చేతులు పట్టుకొని ఏడుస్తుందని చెప్పాను. కీర్తి రెడ్డి దగ్గరికి వెళ్లి మీరు ఏడుస్తూ పవన్ దగ్గరికి వెళ్లి నుదుటిమీద ముద్దు పెట్టుకోండని చెప్పాను. ఇది పవన్ కి తెలిస్తే ఆయన కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి చెప్పకుండా చేస్తున్నానని చెప్పాను. కీర్తి రెడ్డి అలా నుదుటి మీద ముద్దు పెట్టుకోవడంతో పవన్ కి ఏమీ అర్థం కాలేదు. ఒక్క క్షణం షాక్ లో ఉండిపోయారు. ఆ తరువాత అర్థం చేసుకొని ఎంత గొప్పగా తీసావ్ అని’ నన్ను మెచ్చుకున్నారని అన్నాడు.

Exit mobile version