బిరియాని సినిమాతో రాబోతున్న కార్తీ

బిరియాని సినిమాతో రాబోతున్న కార్తీ

Published on Mar 15, 2013 10:41 AM IST

BIRIYANI-5
తమిళ హీరో కార్తీ ‘బిరియాని’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ‘గ్యాంబ్లర్’ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హన్సిక, పంజాబీ భామ మెండీ థాకరె హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కార్తీ, హన్సికల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా. ఈ సినిమాలో ని పాటలను యూరప్ లో చిత్రీకరించారు. యాక్షన్, కామెడి, థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈయనకి ఇది 100వ సినిమా. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు