ఈ రోజు విడుదల కానున్న మల్లిగాడు ఆడియో


కార్తి మరియు ప్రియమణి జంటగా నటించిన ‘మల్లిగాడు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నేషనల్ అవార్డు గెలుచుకున్న తమిళ చిత్రం ‘పరుత్తి వీరన్’ చిత్రాన్ని మల్లిగాడు పేరుతో డబ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ప్రియమణికి మరియు 2007 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రానికి అవార్డులు గెలుచుకున్నారు. అమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 5 సంవత్సరాల క్రితం తమిళంలో విడుదలైంది. ఈ చిత్రం తమిళంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులోని ప్రముఖ హోటల్ తాజ్ డెక్కన్లో జరగనుంది. ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

Exit mobile version