కార్తికేయ టీజర్ కి మంచి రెస్పాన్స్

కార్తికేయ టీజర్ కి మంచి రెస్పాన్స్

Published on Dec 1, 2013 10:02 AM IST

Karthikeya
నిఖిల్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్తికేయ’ ఫస్ట్ లుక్ టీజర్ ని నిన్న హైదరాబాద్ లో లాంచ్ చేసారు. చందూ మొండేటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిఖిల్ నటించిన స్వామి రారా సినిమాకి చందూ మొండేటి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.

ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ ‘ చందూ నాకు కథ చెప్పినప్పుడు నేను ఎంతో థ్రిల్ అయ్యాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నానని’ అన్నాడు. విడుదల చేసిన టీజర్ లో ఈ చిత్ర స్టొరీ లైన్ ఎలా ఉంటుందనేది రివీల్ చేసారు. ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు బోర్డర్ లో ఉన్న సుబ్రమణ్యపురం అనే గ్రామం చుట్టూ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథ నడుస్తుంది. ఈ టీజర్ కి సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన స్వాతి హీరోయిన్ గా కనిపించనుంది.

తాజా వార్తలు