‘కార్తికేయ – 2’ కూడా ప్లాన్ చేశాడు !

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకుందని.. అక్టోబర్ 26 నుండి షూట్ మొదలుకానుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకోవడంతో పాటు సినిమా ఏ అంశం పై ఉంటుందనే విషయాన్ని క్లారిటీగా చూపించింది.

కాగా ఈ సినిమాని ముందు అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ బడ్జెట్‌ తోనే రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మెయిన్ గా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ చేయాల్సి రావడం, అలాగే సినిమాలో టాప్ – క్లాస్ విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి రావడం కారణంగా ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

ఇక స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Exit mobile version