డిసెంబర్ 20న బిర్యానీ రుచిచూపించనున్న కార్తీ

Biriyani-Telugu-First-Look-
కార్తీ, హన్సిక జంటగా నటిస్తున్న ‘బిర్యానీ’ సినిమా ఈ డిసెంబర్ 20నా మన ముందుకు రానుంది. ఒకరాత్రి బిర్యానీ కోసం వెళ్ళిన స్నేహితుల జీవితాలలో కలిగిన మలుపులను దర్శకుడు వెంకట్ ప్రభు తన శైలిలో తెరకెక్కించాడు.స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా సినిమాను తెలుగులో సైతం నిర్మిస్తున్నాడు. అమరేన్ ప్రేమ్ జీ మరియు మాండి తఖర్ ఈ యాక్షన్ ఎంటెర్టైనర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు

మమోలుగా అయితే 2014 జనవరి లో ఈ సినిమా విడుదలకావాల్సివుంది. అయితే సంక్రాంతి బరిలోకి రజనికాంత్ కొచ్చాడయాన్ రావడంతో ఈ సినిమా మూడువారాల ముందే విడుదలకానుంది. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. కార్తీ గతంలో నటించిన ‘శకుని’ మరియు ‘అలెక్స్ పాండ్యన్’ పరాజయాన్ని చవిచూశాయి. ఈ క్రమంలో బిర్యానీ రుచి మనకు నచ్చుతుందో లేదో చూడాలి. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు

Exit mobile version